మనసులో మాట మౌనంగానే చెప్పగలను... అధరము, ఉధరము నడుమున ఉన్న స్పందన చెవులు మూసుకొనైన వినగలను... ఇది అర్థము చేసుకోగలిగే మనసు నీకుందని ఆశిస్తూ... నీ ప్రియసఖి!!
నిర్మలాకారం, నిండుతనం... ఆహ్లాదకరం, అనంతప్రియం... చల్లదనం, చిలిపితనం... ఓ నింగిలోని నెలరాజా! అంత మురిసిపోకు... నిన్ను కాదు నేను కలవరపరిచేది... నా ప్రియుడిని... కలవరపరిచేవా! కలగా మిగిలేవా!! చెప్పు నేస్తమా!!!