Monday, August 25, 2014

కమ్మనైన కలయిక...

రాముడి లాంటి రూపము...

     మిత్రుడి లాంటి మనసు...

అమ్మ లాంటి ఆలన...

    కమ్మనైన ఈ కలయిక నీవే ఓ ప్రియా...

వర్ణాలు...

లోకంలో వర్ణాలు ఎన్నో, కాని వాటి భావాలు వేరు...

తెలుపు శాంతికి నిదర్శనం...

         నలుపు శోకానికి నిదర్శనం...

పసుపు స్నేహానికి నిదర్శనం...

        ఎరుపు సఖి ప్రేమకి నిదర్శనం...

ఈ, వేల వర్ణాల కలయిక అందరి జీవితాలలో విరబూయాలని కోరుకుంటునాను....

చిరుకానుక...

కనురెప్పలకు చిరుకానుక - నిదుర...

నిదురకు చిరుకానుక - లాలిపాట... 

అమ్మనోట పలికే ఈ లాలిపాటకు చిరుకానుక - పాప మాట...

నీ ప్రేమ ఉప్పెన...

మెరుపువై వచావు...

       ఉరుములా చుసావు...

వానవై మనువాడావు...

       వరదలా ప్రేమించావు.... 

నీ ప్రేమ ఉప్పెనలో నేను మునగటానికి సిద్దమే ప్రియా!! 

నీవు-నేను...

నీవు-నేను, 

పాలు నీళ్ళు లాగా కలిసిపోదాం... 

తోడు నీడ లాగా నిలిచిపోదాం...

ఆకు వక్క లాగా కరిగిపోదాం...

ఒకరిలో ఒకరిగా లీనమైపోదాం...

నా ప్రేమ అనంతం...

అంకెలు అనంతం...

           ఆశలు అనంతం...

చుక్కలు అనంతం...

           చినుకులు అనంతం...

నీ ప్రేమ అనంతం...

          నీ మీద నా ప్రేమ అనంతం... 

నేనే 'నీవు' అవనా...

కనిపిస్తావు అంటే, 
      
              నీ ప్రతి చూపులో నేను నీ కన్నును  అవనా.... 

కలవరిస్తావు అంటే, 
           
             నీ ప్రతి నిద్రలో నేను నీ కలను అవనా... 

కవ్విస్తావు అంటే, 
           
            నీ ప్రతి ఉనికిలో నేను నీ కౌగిలింతను అవనా... 

నా మదిలో...

కడలి అల ఎగసిన ప్రతీసారి,  

       ప్రేమ అల ఎగిసింది నా మదిలో... 

నింగి జాబిలి కురిసిన ప్రతీసారి, 

      కలవరింత కురిసింది నా మదిలో...

నీ కనుచూపు తాకిన ప్రతీసారి, 

     పులకరింత తాకింది నా మదిలో... 

అడుగీడిన వేళ...

నీ జీవితంలో అడుగీడిన వేళ, నా జీవనంలో, 

    ఆనందం సాగింది సంగీతంలోని సప్త స్వరాల్లా... 
  
                అభిమానం విరిసింది హరివిల్లులోని సప్త రంగుల్లా...

                              సంతోషం వెదజల్లింది నింగిలోని సప్త ఋషుల్లా... 

ధర్మసంకటము...

ఎవరు గొప్పా, అని అడిగితే ఏమని చెప్పను...

ప్రాణం పోసినది ఒకరు... ప్రాణమైనది ఇంకొకరు...

వీడలేని, విడతీయలేని బంధం ఇద్దరిది...

ఈ ధర్మసంకటము నాకేల ప్రియా... 

నా మనసంతా నీవే...

నా ప్రతి నవ్వులో నీవే...

          నా ప్రతి కన్నీటి చుక్కలో నీవే...

నా ప్రతి కమ్మని కలలో నీవే...

          నా ప్రతి కలవరింతలో నీవే... 

నా ఊసంతా నీవే... నా మనసంతా నీవే...

నా దరికి చేరవ ప్రియతమా!

ఎడారిలో ఎండమావి లాగా కనిపిస్తావు...

సంద్రంలో అల లాగా పలకరిస్తావు...

నింగిలో నెలరాజు లాగా తొంగిచూస్తావు...

ప్రియతమా! ఏలా మన ఇద్దరి మధ్య ఈ దూరం, నా దరికి చేరవ ఈ క్షణం... 

నీవు నా చెంత ఉండినచో...

అల నింగిలోని చందమామలో నీ రూపం చూస్తూ...

జామ చెట్ల పండ్లతో ఊసులాడుతూ,  

చల్లని పిల్ల గాలి నను తాకుతుంటే... 

ఆహా ప్రియా! నీవు నా చెంత ఉండినచో, 

నిను నా వెచన్ని కౌగిలిలో బంధించి, ముద్దుల వర్షం కురిపించనా...

నాకు తెలుసు...

ఓ! చిలిపి చెలికాడా!! నాకు తెలుసు,

నీవు, నా మౌనం భరించలేవు కానీ, మనసును భావింపకలవు....

నా కోపం భరించలేవు కానీ, తాపాన్నీ భావింపకలవు....

రాతల్లో... గీతల్లో...ఆశల్లో ...

ఈ చెలి,

    నుదుటి రాతల్లో రాసినది,

చేతి గీతల్లో గీసినది,

    మది ఆశల్లో దాగినది,

నీవే కదా ఆ సుందరుడివి, నా ప్రియ సఖుడివి!

సఖి చిరునవ్వు...

నా ప్రియ సఖి పెదవి అంచులలో ఉన్న ఓ చిరువ్వా...

ఒక తారవై మెరవవా...

              చినుకువై కురవవా...

హరివిల్లువై విరువవా...

              మా ఇంట్లో సంబరమై నిలువవా...

Wednesday, August 6, 2014

City Reflections...


A beautiful series of city buildings reflecting in sea water... Shot by me @ Free Trade Zone, Kuwait...

స్నేహం...

స్నేహితులారా మీతో గడిపిన కాలంలో,     

మరువలేనివి ఏన్నో...

మరపురానివి  మరెన్నో...

మధుర క్షణాలు ఎన్నెన్నో... 

మన స్నేహం ఇలాగే చిరకాలం నిలవాలని కోరుకుంటూ... మీ ప్రియ నేస్తం జ్యోత్స్న... 

ఓ చందమామ!!!

ఓ చందమామ!

   నన్ను నేను మరిచా నిన్ను చూసాక...

   కాని, నిన్ను నేను మరిచా, తనని చూసాక...

   నాలో ప్రాణమై... తనలో లీనమై...

            నన్ను మరిపించిన 'నిన్ను' కూడా మరిచేలా చేసిన అతను, 
                                                      నా కనుల ముంగిట నిలువడేల!!!