Sunday, February 22, 2015

నీ ప్రేమ రక్ష...

కను పాపకు కంటిరెప్ప ప్రేమ రక్ష...
                          

పసిపాపకు కన్నతల్లి ప్రేమ రక్ష...
                          

జాలరివాడికి కడలి తల్లి ప్రేమ రక్ష...
                          

నా హ్రుదయానికి కల్మషంలేని
                             నీ ప్రేమ రక్ష...

కళ్ళాలు!!!

సాయంసంధ్య వేళ, 
    చల్లని పిల్ల గాలులకు,

చెలి! నీ నల్లని కురులు 
    నా మోము తాకుంతుంటే,
         నా మనసు ఉరకలు వేస్తుంటే...

పరుగెడుతున్న నా హ్రుదయానికి,
        కళ్ళాలు వేయ గల శక్తి ఉన్నది నీ ప్రేమకే కదా సఖీ! 

వెళుగు! నీడ!!

రవికాంతుని వెళుగులో,
                     పొగమంచు నీడలో...

వెండి వెన్నెల వెళుగులో,
                    మల్లెపందిరి నీడలో...

కరిగే కొవొత్తి వెలుగులో,
                   పడకమంచం నీడలో...

చెలి! నా వెలుగు నీవు కాగ,
                   నీ నీడ నేను కానా!!

పుట్టిన రోజు శుభాకాంక్షలు...

తప్పటడుగుల వేళ తండ్రివై సరిదిద్దావు...

ఒంటరినైన వేళ ఆత్మీయుడివై పలకరించావు...

సంతోషం పంచే వేళ స్నేహితుడివై నిలిచావు...

బాధ కలిగిన వేళ బంధువై ఓదార్చావు...

ఎల్లపుడు నీ చెలిమిని కోరే నా మనసు పలుకుతోంది నా ప్రియ మిత్రునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...

నా కలలు, ఎరగవు కదా ఎల్లలు!!

అలుపంటూ ఎరగనివి అలలు...

కల్మషమంటూ ఎరగనివి కలలు...

ఎదురుచూపంటూ ఎరగనివి ఎల్లలు...

ప్రియా! అలలై పొంగుతున్న నా కలలు,

                                      ఎరగవు కదా ఎల్లలు, 

                                                   నీ ప్రేమ నా తోడై  ఉన్నపుడు...

Monday, February 16, 2015

అందం! బంధం!!

కనులు రాసె కవితలకు,
                నీ ఊహే కదా అందం!

పెదవి పలికె పలుకులకు,
               నీ పేరే కదా అందం!

పాదం వేసే అడుగులకు,
              నీ బాటే కదా అందం!

మనసు కోరే ఆశలకు,
            నీ ప్రేమే కదా అందం,
                నీ శ్వాసే కదా బంధం!!

ఆలకించు నా నివేదన!!

కనుల తెరల వెనుక కనబడలేదా 
                                    నా వేదన!

మనసు పొరల వెనుక కనబడలేదా 
                                   నా ఆవేదన!

ప్రేమ పరదాల వెనుక కనబడలేదా 
                                  నా మనోవేదన!

ప్రియా! ఎన్నాలు ఈ విరహవేదన,
                                ఇకనైన ఆలకించు నా నివేదన!!

ఓ కన్నీరా!

కనుపాపలో తెరవై నిలిచినా...

కారు మబ్బులో చినుకై కురిసినా... 

కడలి వడిలో అలవై ఎగసినా...

మానవ, సంతోష, విషాద, 
          హ్రుదయ స్పందనకు,
                  కనుపాప నుంచి చిరు చినుకువై వ్రాలి, కడలివై పొంగే  
                                                               ఓ కన్నీరా! ఇదే నీకు నా జోహార్లు!! 

నా సౌందర్యవనం!!!

నీ కలువ కళ్ళపై కాళిదాసు కవిత రాసె...

నీ నయగార నడుముపై నటరాజు నాట్యమాడె...

నీ పసిడి పెదెవిపై పింగళి పాటకూర్చె...

ఆహా! చెలి! ఏమీ నీ అందం... ఇదే కదా నా సౌందర్యవనం!!! 

నీవు దూరమాయె! నేను దగ్గరాయె!!

కనులకు నీవు దూరమాయె,
కంటిపాపకు కన్నీరు దగ్గరాయె!

నింగికి నీలి మబ్బు దూరమాయె,
నేల తల్లికి నీటి చుక్క దగ్గరాయె!

చెలికత్తెకు చెలికాడు దూరమాయె,
చిరు చితికి నేను దగ్గరాయె!!

చితిదాక నా ప్రాణమై వుంటావా!!!

గాలివై వచావు, నా గాత్రమైపోయావు...

మెరుపువై వచావు, నా మోమువైపోయావు... 

ఉరుమువై వచావు, నా ఊపిరైపోయావు...

తుఫానువై వచావు, నా తనువైపోయావు...

చితిదాక నా ప్రాణమై వుంటావా లేక ప్రళయమవుతావ!!   

రమనీయం, రసమయం!!!

వెండి వెన్నెల వన్నెలు 
                     వర్ణనతీతియం...

చెలి చెంప చిరునవ్వు 
                    చిరస్మరణీయం...

కొంటె కోయిల కూత 
                   కమనీయం...

రేయి పూట రాణి రూపం రమనీయం, రసమయం...

అమ్మ హ్రుదయం!

ఆకాశమంత విశాలమైనది,

        సముద్రమంత లోతైనది,

కెరటమంత ఓర్పైనది,

       ముత్యమంత స్వఛమైనది,

                          అమ్మ హ్రుదయం!

అమ్మా! ఇదే... నీకు నా వందనం, అభివందనం!!

విఫలమైన ప్రేమ!!!

భావింపలేనిది, బాధగా మిగిలేది...

భరించలేనిది, భారముగా మిగిలేది...

ప్రవహించలేనిది, ప్రశ్నగా మిగిలేది...

మురిపింపలేనిది, మృత్యువుగా మిగిలేది...

అదే విఫలమైన ప్రేమ!!!

Sunday, February 8, 2015

నీ-నా-మన ప్రేమ...

నీలో బంధించావు, ఊపిరాడుతుందా అని ప్రశ్నించావు...

నీలో కలుపుకున్నావు, ఇమడగలవా అని ప్రశ్నించావు...

నీలో సగమన్నావు, చోటు సరిపొతుందా అని ప్రశ్నించావు...

అన్ని పనులు నీవే, అన్ని ప్రశ్నలు నీవే...

కాని, వీటన్నిటికి జవాబు మాత్రం ఒక్కటే...

అదే... నీ-నా-మన ప్రేమ... 

వాన, ఏల నాపై నీకీ ప్రేమ!!!

చిరుజల్లువై చిగురించావు...

విరజల్లువై వికసించావు...

హరివిల్లువై హర్షించావు...

ప్రతి మదిని తాకే ఓ వాన, ఏల నాపై నీకీ ప్రేమ!!!

చావే శరణమన్నావు...

అలరించావు... అందనన్నావు...

మురిపించావు... మరువమన్నావు...

నీ శ్వాస కోసం ఎదురు చూసే నాకు చావే శరణమన్నావు...

జీవితం ఇవ్వమని అడగలేను...

మరువలేనివి కొన్ని...

మరపురానివి కొన్ని...

మరనించలేను... అలా అని జీవితం ఇవ్వమని అడగలేను...

నేను కోరుకునేది నీ మంచికి...

నీ పలుకులే అందం 
                 నా చెవులకి...

నీ చూపులే అందం 
                నా హ్రుదయానికి...

నీ నవ్వులే అందం
                నా మనసుకి...

అందుకే ప్రియతమా నేను కోరుకునేది 
                                         నీ మంచికి...

Thursday, February 5, 2015

మనసులో మాట...

మనసులో మాట మౌనంగానే చెప్పగలను...

అధరము, ఉధరము నడుమున ఉన్న స్పందన చెవులు మూసుకొనైన వినగలను...

ఇది అర్థము చేసుకోగలిగే మనసు నీకుందని ఆశిస్తూ... నీ ప్రియసఖి!!

వదిలి వెళ్ళకు నేస్తమా...

నన్ను వదిలి వెళ్ళకు నేస్తమా...

నీడై నీ తోడు వుంటాను కలకాలము...

నిలిచిపోతాను నీలో సగమై చిరకాలము...

కలవరపరిచేవా! కలగా మిగిలేవా!!

నిర్మలాకారం, నిండుతనం... 

ఆహ్లాదకరం, అనంతప్రియం...

చల్లదనం, చిలిపితనం...

ఓ నింగిలోని నెలరాజా! అంత మురిసిపోకు... 

నిన్ను కాదు నేను కలవరపరిచేది... నా ప్రియుడిని... 

కలవరపరిచేవా! కలగా మిగిలేవా!! చెప్పు నేస్తమా!!! 

వేచివున్నా... ఓ ప్రేయసిలా!!!

పెదవిపై పవలించే పువ్వులా...

నడుముపై నాట్యమాడే నెమళిలా... 

చెక్కిలిపై చిందేసే చినుకులా...

వీపుపై విహరించే విహంగిలా...

ప్రియతమా! నీ అధర చుంబనం కోసం వేచివున్నా, ఓ ప్రేయసిలా...

నా హ్రుదయ ఆలాపనా...

కెరటమై కదిలించావు...
    కలవై కవ్వించావు... 
      కన్నీరువై కరిగించావు...

ఇక ఎన్నాళు ప్రియతమా!
     ఈ విరహ వేదన, నా హ్రుదయ ఆలాపనా...

ఒక యుగం...

చూడలని ఉన్నా చూడలేను...

ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేను...

చేరాలని ఉన్నా చేరలేను...

ప్రతి క్షణం ఒక యుగం ఇవి ఏవి జరగనప్పుడు...

నాలో కరిగావు...నీలో మిగిలాను...

స్నేహితుడివై పరిచయమయ్యావు....

           ఆత్మీయుడివై పలకరించావు...


                    బంధువై ప్రోత్సహించావు...


ప్రియుడివై నాలో కరిగావు...


               ప్రేయసివై నీలో మిగిలాను...

వేచివుండే...

సముద్రతీరం అల కోసం వేచివుండే...

కంటిపాప నిదుర కోసం వేచివుండే...


రైతుబిడ్డ చినుకు కోసం వేచివుండే...


మిత్రమా! నేను, నీ నేస్తం కోసం వేచివుండే...

అనంతప్రియం...

మిత్రమా! 
అద్భుతం నీ కవిత...
                      అమోహం నీ ఊహ...

ఆహ్లాదకరం నీ రాత...
                    అనంతప్రియం నీ మనసులో మాట...