నల్లని నేలకు పైరు తోడై ఉండగా, పచ్చని పైరుకి చినుకు తోడవదా! చల్లని చినుకుకి మేఘం తోడై ఉండగా, మెరిసే మేఘానికి మెరుపు తోడవదా! చిమ్మ చీకటికి వెన్నెల తోడై ఉండగా, వెండి వెన్నెలకి రవికిరణం తోడవదా! ప్రియా! అలాగే... మంచి మనసుకి నీ నేస్తం తోడై ఉండగా, నిర్మలమైన నీ నేస్తానికి నేను తోడవనా!!!
కలల ప్రయాణం మెలుకువ వరుకు అయిన, వాటి గమ్యం సహకారం చెసుకోవటం.... అలల ప్రయాణం తీరం వరకు అయిన, వాటి గమ్యం ఒడ్డుకు చేరుకోవటం.... స్నేహ ప్రయాణం జీవితాంతం అయిన, దాని గమ్యం కలకాలం నిలిచిపోవాలని.... ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకు అయిన, దాని గమ్యం తోడు-నీడై ఉండాలని... గమ్యాలు వేరైనా, ఎప్పటికీ కావాల్సింది ఒకే ఒక్కటి... అదే ద్రుఢమైన సంకల్పం....
నా లోన ఊహ నీవే... నా లోన శ్వాస నీవే... నా లోన ధ్యాస నీవే... నా లోన ఆశ నీవే... నా లోన మాట నీవే... నా లోన పాట నీవే... నా లోన ఆట నీవే... నా లోన కల నీవే... నా లోన అల నీవే... నా లోన కథ నీవే... నా లోన జత నీవే... నాలో ఉన్న నీకు, "నా" అనిపించే ప్రతీ అనువు అనువు "నీ" అనే "నాకు" అంకితం...
Quilling or paper filigree is an art form that involves the use of strips of paper that are rolled, shaped, and glued together to create decorative designs...