Thursday, June 27, 2019

ఓ పుస్తకమా!

లక్ష్యం లేని పరుగు వృధా...
నిద్ర లేని జోల వృధా...
పాట లేని రాగం వృధా...
గమ్యం లేని బ్రతుకు వృధా...
అలాగే స్నేహం లేని జీవనం, జీవం లేని ప్రాణం వలే వృధా...

ఎల్లప్పుడూ నా మంచి మిత్రుడు నా పుస్తకం... 

ఇదే నా మైత్రీ, నా చెలిమి, నా చిరు నేస్తం...
కలకాలం నీతో గడిపేస్తా, స్వార్ధం లేని ప్రియ మిత్రమా, ఓ పుస్తకమా!   

Tuesday, June 18, 2019

మన చిరు స్నేహం...

తేనె పలుకులు, తీపి తగాదాలు...
చిరు కోపాలు, చిలిపి చేష్టలు... 

అల్లరి అలకలు, అపారమైన అభిమానాలు...
గాలి తిరుగుళ్ళు, గమ్యం వైపు పరుగులు...

కంటిపాప రక్షణలు, కల్మషం లేని ప్రేమలు...
చేదు జ్ఞాపకాలు, చిరస్మరణీయ సరదాలు...

ఈ షడ్రుచుల కలయికే మన చిరు స్నేహం...

పౌర్ణమి నాటి వెండి వెన్నెల వలె,
ప్రతి దినం ప్రకాశించే రవికాంతుల వలె,
వేయి జన్మలూ మన బంధం శాశ్వతంగా నిలవాలని కోరుకుంటూ...

                                                    -- నీ ప్రియ నేస్తం.

Monday, June 17, 2019

ఓసి! పిచ్చి పచ్చ నోటా!

నవయుగ నారీమనులు ఆశించేది నగదు...
ధనవంతులకు లెక్కలేనిది డబ్బు...

తనయుడి తండ్రులకు తీపైనది తైలము...
పేదవాడి ఇంట రాలనిది పచ్చనోటు...

ఓసి! పిచ్చి పచ్చ నోటా! ఎగిసి ఎగిసి పడకు...
నిన్ను తలదన్నే శక్తి ప్రేమకి మాత్రమే ఉంది!!