Tuesday, September 20, 2016

స్నేహ బంధం...

స్నేహ బంధమనే తోటలో,
         నేనొక సీతాకోకచిలుకనై
నీ స్నేహమనే పుప్పడి కోసం
         చిరకాలం ఎదురుచూస్తాను నేస్తమా!!

నేను తోడవనా!!!

నల్లని నేలకు పైరు తోడై ఉండగా,
పచ్చని పైరుకి చినుకు తోడవదా!

చల్లని చినుకుకి మేఘం తోడై ఉండగా,
మెరిసే మేఘానికి మెరుపు తోడవదా!

చిమ్మ చీకటికి వెన్నెల తోడై ఉండగా,
వెండి వెన్నెలకి రవికిరణం తోడవదా! 

ప్రియా! అలాగే...

మంచి మనసుకి నీ నేస్తం తోడై ఉండగా, 
నిర్మలమైన నీ నేస్తానికి నేను  తోడవనా!!!

Thursday, September 1, 2016

ద్రుఢమైన సంకల్పం....

కలల ప్రయాణం మెలుకువ వరుకు అయిన, 
                 వాటి గమ్యం సహకారం చెసుకోవటం.... 
అలల ప్రయాణం తీరం వరకు అయిన, 
                వాటి గమ్యం ఒడ్డుకు చేరుకోవటం.... 
స్నేహ ప్రయాణం జీవితాంతం అయిన, 
                దాని గమ్యం కలకాలం నిలిచిపోవాలని.... 
ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకు అయిన, 
                దాని గమ్యం తోడు-నీడై ఉండాలని... 

గమ్యాలు వేరైనా, ఎప్పటికీ కావాల్సింది ఒకే ఒక్కటి... అదే ద్రుఢమైన సంకల్పం....

తలుపు తట్టి చూడు...


లయ తలుపు తట్టితే, పాటతో పలకరించదా... 
లాలి తలుపు తట్టితే, నిద్రతో పలకరించదా... 

కడలి తలుపు తట్టితే, అలతో పలకరించదా... 
కన్ను తలుపు తట్టితే, కలతో పలకరించదా... 

మయూరి తలుపు తట్టితే, నాట్యంతో పలకరించదా... 
మేఘం తలుపు తట్టితే, వర్షంతో పలకరించదా... 

ప్రియ, నా మనసు తలుపు తట్టి చూడు, నీ పేరుతో పలకరించదా...