"ఊ...ఊ...ఊ..." చిన్నపుడు అమ్మ చెప్పే కథలు వింటూ -"ఊ...ఊ...ఊ..." క్లాసులో టీచర్ చెప్పే పాఠాలు వింటూ - "ఊ...ఊ...ఊ..." టీనేజిలో ప్రేయసి చెప్పే ఊసులు వింటూ - "ఊ...ఊ...ఊ..." పెళ్ళి తర్వాత భార్య చెప్పే ప్రతీ మాట వినకుండానే - "ఊ...ఊ...ఊ..."
నాలుగేల్ల క్రితం, ఈ రెండు కనులు, ఆ రెండు కనులని కలిశాయి... ఈ రెండు చేతులు, ఆ రెండు చేతులతో భాసలు వేసుకుందామని తపన పడాయి... ఈ రెండు కాళ్ళు, ఆ రెండు కాళ్ళతో బాటలు వేద్దామని ఊగిసలాడాయి.... రెండు కుటుంబాలు, రెండు మనసులు ఒకటిగా కలవాలని నిశ్చయించుకున్నాయి... మరి ఇప్పుడు, మేము నలుగురము కాని, మా చూపు ఒకటే, చేత ఒకటే, బాట ఒకటే, మనసూ ఒకటే...