Wednesday, December 24, 2014

"ఊ...ఊ...ఊ..."

"ఊ...ఊ...ఊ..." 

చిన్నపుడు అమ్మ చెప్పే కథలు వింటూ -"ఊ...ఊ...ఊ..." 

క్లాసులో టీచర్ చెప్పే పాఠాలు వింటూ - "ఊ...ఊ...ఊ..."

టీనేజిలో ప్రేయసి చెప్పే ఊసులు వింటూ - "ఊ...ఊ...ఊ..." 

పెళ్ళి తర్వాత భార్య చెప్పే  ప్రతీ మాట వినకుండానే - "ఊ...ఊ...ఊ..." 

Wednesday, November 19, 2014

అన్నీ ఒకటే...

నాలుగేల్ల క్రితం,

   ఈ రెండు కనులు, ఆ రెండు కనులని కలిశాయి...

   ఈ రెండు చేతులు, ఆ రెండు చేతులతో భాసలు వేసుకుందామని తపన పడాయి...

   ఈ రెండు కాళ్ళు, ఆ రెండు కాళ్ళతో బాటలు వేద్దామని  ఊగిసలాడాయి.... 

   రెండు కుటుంబాలు, రెండు మనసులు ఒకటిగా  కలవాలని నిశ్చయించుకున్నాయి... 

మరి ఇప్పుడు, 

   మేము నలుగురము కాని, 
                            మా చూపు ఒకటే, చేత ఒకటే, బాట ఒకటే, మనసూ ఒకటే... 

Sunday, September 7, 2014

Ganesh Ji...


Hand made Ganesh idol by me for this Vinayaka Chavithi... Used playing dough for creating it...

Monday, August 25, 2014

కమ్మనైన కలయిక...

రాముడి లాంటి రూపము...

     మిత్రుడి లాంటి మనసు...

అమ్మ లాంటి ఆలన...

    కమ్మనైన ఈ కలయిక నీవే ఓ ప్రియా...

వర్ణాలు...

లోకంలో వర్ణాలు ఎన్నో, కాని వాటి భావాలు వేరు...

తెలుపు శాంతికి నిదర్శనం...

         నలుపు శోకానికి నిదర్శనం...

పసుపు స్నేహానికి నిదర్శనం...

        ఎరుపు సఖి ప్రేమకి నిదర్శనం...

ఈ, వేల వర్ణాల కలయిక అందరి జీవితాలలో విరబూయాలని కోరుకుంటునాను....

చిరుకానుక...

కనురెప్పలకు చిరుకానుక - నిదుర...

నిదురకు చిరుకానుక - లాలిపాట... 

అమ్మనోట పలికే ఈ లాలిపాటకు చిరుకానుక - పాప మాట...

నీ ప్రేమ ఉప్పెన...

మెరుపువై వచావు...

       ఉరుములా చుసావు...

వానవై మనువాడావు...

       వరదలా ప్రేమించావు.... 

నీ ప్రేమ ఉప్పెనలో నేను మునగటానికి సిద్దమే ప్రియా!! 

నీవు-నేను...

నీవు-నేను, 

పాలు నీళ్ళు లాగా కలిసిపోదాం... 

తోడు నీడ లాగా నిలిచిపోదాం...

ఆకు వక్క లాగా కరిగిపోదాం...

ఒకరిలో ఒకరిగా లీనమైపోదాం...