Sunday, February 8, 2015

చావే శరణమన్నావు...

అలరించావు... అందనన్నావు...

మురిపించావు... మరువమన్నావు...

నీ శ్వాస కోసం ఎదురు చూసే నాకు చావే శరణమన్నావు...

జీవితం ఇవ్వమని అడగలేను...

మరువలేనివి కొన్ని...

మరపురానివి కొన్ని...

మరనించలేను... అలా అని జీవితం ఇవ్వమని అడగలేను...

నేను కోరుకునేది నీ మంచికి...

నీ పలుకులే అందం 
                 నా చెవులకి...

నీ చూపులే అందం 
                నా హ్రుదయానికి...

నీ నవ్వులే అందం
                నా మనసుకి...

అందుకే ప్రియతమా నేను కోరుకునేది 
                                         నీ మంచికి...

Thursday, February 5, 2015

మనసులో మాట...

మనసులో మాట మౌనంగానే చెప్పగలను...

అధరము, ఉధరము నడుమున ఉన్న స్పందన చెవులు మూసుకొనైన వినగలను...

ఇది అర్థము చేసుకోగలిగే మనసు నీకుందని ఆశిస్తూ... నీ ప్రియసఖి!!

వదిలి వెళ్ళకు నేస్తమా...

నన్ను వదిలి వెళ్ళకు నేస్తమా...

నీడై నీ తోడు వుంటాను కలకాలము...

నిలిచిపోతాను నీలో సగమై చిరకాలము...

కలవరపరిచేవా! కలగా మిగిలేవా!!

నిర్మలాకారం, నిండుతనం... 

ఆహ్లాదకరం, అనంతప్రియం...

చల్లదనం, చిలిపితనం...

ఓ నింగిలోని నెలరాజా! అంత మురిసిపోకు... 

నిన్ను కాదు నేను కలవరపరిచేది... నా ప్రియుడిని... 

కలవరపరిచేవా! కలగా మిగిలేవా!! చెప్పు నేస్తమా!!! 

వేచివున్నా... ఓ ప్రేయసిలా!!!

పెదవిపై పవలించే పువ్వులా...

నడుముపై నాట్యమాడే నెమళిలా... 

చెక్కిలిపై చిందేసే చినుకులా...

వీపుపై విహరించే విహంగిలా...

ప్రియతమా! నీ అధర చుంబనం కోసం వేచివున్నా, ఓ ప్రేయసిలా...

నా హ్రుదయ ఆలాపనా...

కెరటమై కదిలించావు...
    కలవై కవ్వించావు... 
      కన్నీరువై కరిగించావు...

ఇక ఎన్నాళు ప్రియతమా!
     ఈ విరహ వేదన, నా హ్రుదయ ఆలాపనా...