Thursday, February 5, 2015

ఒక యుగం...

చూడలని ఉన్నా చూడలేను...

ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేను...

చేరాలని ఉన్నా చేరలేను...

ప్రతి క్షణం ఒక యుగం ఇవి ఏవి జరగనప్పుడు...

నాలో కరిగావు...నీలో మిగిలాను...

స్నేహితుడివై పరిచయమయ్యావు....

           ఆత్మీయుడివై పలకరించావు...


                    బంధువై ప్రోత్సహించావు...


ప్రియుడివై నాలో కరిగావు...


               ప్రేయసివై నీలో మిగిలాను...

వేచివుండే...

సముద్రతీరం అల కోసం వేచివుండే...

కంటిపాప నిదుర కోసం వేచివుండే...


రైతుబిడ్డ చినుకు కోసం వేచివుండే...


మిత్రమా! నేను, నీ నేస్తం కోసం వేచివుండే...

అనంతప్రియం...

మిత్రమా! 
అద్భుతం నీ కవిత...
                      అమోహం నీ ఊహ...

ఆహ్లాదకరం నీ రాత...
                    అనంతప్రియం నీ మనసులో మాట...

Wednesday, January 28, 2015

Time to go home...


Even birds are happy to go home in the evening... Clicked @ Free Trade Zone, Kuwait...             

Wednesday, December 24, 2014

"ఊ...ఊ...ఊ..."

"ఊ...ఊ...ఊ..." 

చిన్నపుడు అమ్మ చెప్పే కథలు వింటూ -"ఊ...ఊ...ఊ..." 

క్లాసులో టీచర్ చెప్పే పాఠాలు వింటూ - "ఊ...ఊ...ఊ..."

టీనేజిలో ప్రేయసి చెప్పే ఊసులు వింటూ - "ఊ...ఊ...ఊ..." 

పెళ్ళి తర్వాత భార్య చెప్పే  ప్రతీ మాట వినకుండానే - "ఊ...ఊ...ఊ..." 

Wednesday, November 19, 2014

అన్నీ ఒకటే...

నాలుగేల్ల క్రితం,

   ఈ రెండు కనులు, ఆ రెండు కనులని కలిశాయి...

   ఈ రెండు చేతులు, ఆ రెండు చేతులతో భాసలు వేసుకుందామని తపన పడాయి...

   ఈ రెండు కాళ్ళు, ఆ రెండు కాళ్ళతో బాటలు వేద్దామని  ఊగిసలాడాయి.... 

   రెండు కుటుంబాలు, రెండు మనసులు ఒకటిగా  కలవాలని నిశ్చయించుకున్నాయి... 

మరి ఇప్పుడు, 

   మేము నలుగురము కాని, 
                            మా చూపు ఒకటే, చేత ఒకటే, బాట ఒకటే, మనసూ ఒకటే... 

Sunday, September 7, 2014

Ganesh Ji...


Hand made Ganesh idol by me for this Vinayaka Chavithi... Used playing dough for creating it...