Sunday, March 29, 2020

ఒంటరి ప్రయాణం...

కోటి చుక్కల నడుమ ఒంటరి నెలవంక జీవితం నాది...
లక్ష భావాల నడుమ ఒంటరి బాధ నాది...
వేయి బంధాల నడుమ ఒంటరి బతుకు నాది...
వంద భాషల నడుమ ఒంటరి  మూగ భాష నాది... 

సాగిపో జీవనమా, సాగిపో !
ఆపదు కన్నీరు, ఈ పయనం ఎప్పటికి !!   
ఆగదు ఈ ఒంటరి ప్రయాణం ఎన్నటికి!!!   

Thursday, June 27, 2019

ఓ పుస్తకమా!

లక్ష్యం లేని పరుగు వృధా...
నిద్ర లేని జోల వృధా...
పాట లేని రాగం వృధా...
గమ్యం లేని బ్రతుకు వృధా...
అలాగే స్నేహం లేని జీవనం, జీవం లేని ప్రాణం వలే వృధా...

ఎల్లప్పుడూ నా మంచి మిత్రుడు నా పుస్తకం... 

ఇదే నా మైత్రీ, నా చెలిమి, నా చిరు నేస్తం...
కలకాలం నీతో గడిపేస్తా, స్వార్ధం లేని ప్రియ మిత్రమా, ఓ పుస్తకమా!   

Tuesday, June 18, 2019

మన చిరు స్నేహం...

తేనె పలుకులు, తీపి తగాదాలు...
చిరు కోపాలు, చిలిపి చేష్టలు... 

అల్లరి అలకలు, అపారమైన అభిమానాలు...
గాలి తిరుగుళ్ళు, గమ్యం వైపు పరుగులు...

కంటిపాప రక్షణలు, కల్మషం లేని ప్రేమలు...
చేదు జ్ఞాపకాలు, చిరస్మరణీయ సరదాలు...

ఈ షడ్రుచుల కలయికే మన చిరు స్నేహం...

పౌర్ణమి నాటి వెండి వెన్నెల వలె,
ప్రతి దినం ప్రకాశించే రవికాంతుల వలె,
వేయి జన్మలూ మన బంధం శాశ్వతంగా నిలవాలని కోరుకుంటూ...

                                                    -- నీ ప్రియ నేస్తం.

Monday, June 17, 2019

ఓసి! పిచ్చి పచ్చ నోటా!

నవయుగ నారీమనులు ఆశించేది నగదు...
ధనవంతులకు లెక్కలేనిది డబ్బు...

తనయుడి తండ్రులకు తీపైనది తైలము...
పేదవాడి ఇంట రాలనిది పచ్చనోటు...

ఓసి! పిచ్చి పచ్చ నోటా! ఎగిసి ఎగిసి పడకు...
నిన్ను తలదన్నే శక్తి ప్రేమకి మాత్రమే ఉంది!!

Sunday, April 16, 2017

ఒకరికి ఒకరం, మీఅందరికి మేమందరం... (One for One... We are there for everyone...)

పోరాడు... పోరాడు... గెలిచే వరకు పోరాడు నేస్తమా...

నిద్రించిన నీ ధైర్యాన్ని నిదుర లేపు స్నేహమా...
మూతబడిన నీ మనోస్తైర్యాన్ని మేల్కొలుపు మిత్రమా...

ముళ్ళు లేని బాట లేదు జీవిత పయణంలో...
నడుంకట్టి ముందుకు సాగు జీవన పోరాటంలో...

మనసు తలుపు తెరిచి చూడు, ఆనందం నీ కోసం వేచి ఉంది...
న్నీటి పరదా తెరిచి చూడు, అందమైన కల నీ కోసం వేచి ఉంది...

ఒకరికి ఒకరం, మీ అందరికి మేమందరం అంటూ,
నీ వెంట మేము సైతం పోరాడుతాం నీ కోసం...

నీ బాధకు పరదా మేము వేస్తాం...
నీ గెలుపుకు తెర మేము తీస్తాం...

నీ జీవిత పయణంలో ప్రతీ అడుగు మేమవుతాం...
నీ జీవన పోరాటంలో ప్రతీ గెలుపు మేమందిస్తాం...

సాగిపో నా ప్రియ మిత్రమా, సాగిపో...
నీ అందమైన ఆశల బాటలో...

ఒకరికి ఒకరం, మీ అందరికి మేమందరం...

Sunday, February 19, 2017

షడ్రుచుల కలయిక...

లవణం వంటి మన లవ్వుకి 6 సంవత్సరాలు...
             మథురం వంటి మన మాటలకి 6 సంవత్సరాలు...
పులుపు వంటి మన పిలుపులకి 6 సంవత్సరాలు...
             కారం వంటి మన కథలకి 6 సంవత్సరాలు...
చేదు వంటి మన చేష్టలకి 6 సంవత్సరాలు... 
            వగరు వంటి మన వలపులకి 6 సంవత్సరాలు... 
మన ఈ ఆరు సంవత్సరాల షడ్రుచుల కలయిక 
           ఇలాగే కలకాలం నిలిచిపోవాలని  కోరుకుంటూ...  

                                                              -నీ ప్రియ సఖి... 

Sunday, January 15, 2017

నా ప్రతీ ఊపిరిలో ఉనికి నీవే...

నా ప్రతీ నవ్వు వెనుక దాగి ఉన్న 
                 కథవా లేక కలవా నీవు...
నా ప్రతీ అడుగు వెనుక దాగి ఉన్న 
                 పాదమా లేక పయణమా నీవు...
నా ప్రతీ శ్వాస వెనుక దాగి ఉన్న 
                 ఉనికివా లేక ఊపిరివా నీవు....
నా
      ప్రతీ కలలో కథ నీవే...
      ప్రతీ పయణంలో పాదమూ నీవే...
      ప్రతీ ఊపిరిలో ఉనికి నీవే... 

Tuesday, September 20, 2016

స్నేహ బంధం...

స్నేహ బంధమనే తోటలో,
         నేనొక సీతాకోకచిలుకనై
నీ స్నేహమనే పుప్పడి కోసం
         చిరకాలం ఎదురుచూస్తాను నేస్తమా!!

నేను తోడవనా!!!

నల్లని నేలకు పైరు తోడై ఉండగా,
పచ్చని పైరుకి చినుకు తోడవదా!

చల్లని చినుకుకి మేఘం తోడై ఉండగా,
మెరిసే మేఘానికి మెరుపు తోడవదా!

చిమ్మ చీకటికి వెన్నెల తోడై ఉండగా,
వెండి వెన్నెలకి రవికిరణం తోడవదా! 

ప్రియా! అలాగే...

మంచి మనసుకి నీ నేస్తం తోడై ఉండగా, 
నిర్మలమైన నీ నేస్తానికి నేను  తోడవనా!!!

Thursday, September 1, 2016

ద్రుఢమైన సంకల్పం....

కలల ప్రయాణం మెలుకువ వరుకు అయిన, 
                 వాటి గమ్యం సహకారం చెసుకోవటం.... 
అలల ప్రయాణం తీరం వరకు అయిన, 
                వాటి గమ్యం ఒడ్డుకు చేరుకోవటం.... 
స్నేహ ప్రయాణం జీవితాంతం అయిన, 
                దాని గమ్యం కలకాలం నిలిచిపోవాలని.... 
ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకు అయిన, 
                దాని గమ్యం తోడు-నీడై ఉండాలని... 

గమ్యాలు వేరైనా, ఎప్పటికీ కావాల్సింది ఒకే ఒక్కటి... అదే ద్రుఢమైన సంకల్పం....

తలుపు తట్టి చూడు...


లయ తలుపు తట్టితే, పాటతో పలకరించదా... 
లాలి తలుపు తట్టితే, నిద్రతో పలకరించదా... 

కడలి తలుపు తట్టితే, అలతో పలకరించదా... 
కన్ను తలుపు తట్టితే, కలతో పలకరించదా... 

మయూరి తలుపు తట్టితే, నాట్యంతో పలకరించదా... 
మేఘం తలుపు తట్టితే, వర్షంతో పలకరించదా... 

ప్రియ, నా మనసు తలుపు తట్టి చూడు, నీ పేరుతో పలకరించదా... 

Wednesday, August 31, 2016

నీ ప్రేమ ఆపి, నా ఊహ చెరిపి...

అంతులేని సీమలో,
అందమైన ఊహలో,
విహంగ విహారం చేస్తునాను అనంతమైన నీ ప్రేమలో... 
నీ ప్రేమ ఆపి, నా ఊహ చెరిపి, నన్ను ఒంటరిని చేయకు ప్రియతమా ఈ గగనసీమలో!!!   

నీ నీడ - నా జాడ...

మరువలేని జాడ, మథురమైన నీ నీడ...
మరపురాని పాట, మనసులో నీ మాట..

నీ మాట చెప్పి, నా పాట కట్టవా...

నీ నీడ చూపి, నా జాడ తెలుపవా...

Thursday, August 25, 2016

"నీ" అనే "నాకు" అంకితం...

నా లోన ఊహ నీవే...
నా లోన శ్వాస నీవే...
నా లోన ధ్యాస నీవే...
నా లోన ఆశ నీవే...

       నా లోన మాట నీవే...
       నా లోన  పాట నీవే...
       నా లోన ఆట నీవే...

నా లోన కల నీవే...
నా లోన అల నీవే...

       నా లోన కథ నీవే...
       నా లోన జత నీవే...  

నాలో ఉన్న నీకు, "నా" అనిపించే ప్రతీ అనువు అనువు "నీ" అనే "నాకు" అంకితం...

Monday, February 29, 2016

Quilling - 'Josh'







Quilling my name... :)

Quilling or paper filigree is an art form that involves the use of strips of paper that are rolled, shaped, and glued together to create decorative designs... 


Pot Paintings...



Pot paintings using kulfi pots... Recycling... ;)