లయ తలుపు తట్టితే, పాటతో పలకరించదా...
లాలి తలుపు తట్టితే, నిద్రతో పలకరించదా...
కడలి తలుపు తట్టితే, అలతో పలకరించదా...
కన్ను తలుపు తట్టితే, కలతో పలకరించదా...
మయూరి తలుపు తట్టితే, నాట్యంతో పలకరించదా...
మేఘం తలుపు తట్టితే, వర్షంతో పలకరించదా...
ప్రియ, నా మనసు తలుపు తట్టి చూడు, నీ పేరుతో పలకరించదా...
No comments:
Post a Comment